News April 7, 2025
వనపర్తి: ‘సింగోటం గుడిలో ప్రేమ జంట పెళ్లి చేస్తాం’

తమకు పెళ్లి చేయాలని వనపర్తి జిల్లా పానగల్ PSకు వచ్చిన <<16017433>>నందిని, మహేందర్<<>> పెళ్లి త్వరలో చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని హైదరాబాద్‌లో ఫామ్-డి చదువుతోందని, మహేందర్ డిగ్రీ చదివి జాబ్ సెర్చ్ చేస్తున్నాడన్నారు. ఇద్దరు మేజర్లు, అందులోనూ చదువుకున్న వారు కావడంతో వారి పెళ్లికి కుటుంబీకులను ఒప్పించామని చెప్పారు. మంచి ముహూర్తం చూసి త్వరలో కొల్లాపూర్ పరిధి సింగోటం గుడిలో పెళ్లి చేస్తామన్నారు.
Similar News
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<
News January 17, 2026
మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 17, 2026
పాలమూరు: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరు గ్రామానికి చెందిన గంగమోని భావుడు, అంతమ్మ దంపతుల కుమారుడు చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వ విభాగమైన సీఐఎస్ఎఫ్ (CISF)లో ఉద్యోగాన్ని సాధించి తమ గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచాడని గ్రామస్థులు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొని ఈ ఉద్యోగాన్ని పొందిన చంద్రశేఖర్‌ను గ్రామస్థులు అభినందించారు.


