News March 26, 2024
ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా చెల్లింపులు: అచ్చెన్నాయుడు

AP: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా CFMS ద్వారా గుత్తేదారులకు చెల్లింపులు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఈ మేరకు లేఖ రాసిన ఆయన.. ‘ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, OSD ధనుంజయ్ రెడ్డి CFMSను అధీనంలోకి తీసుకుని నిధులు మళ్లిస్తున్నారు. ఈ చెల్లింపులపై విచారణ జరపాలి. వాళ్లిద్దరిని విధుల నుంచి తప్పించాలి’ అని ఫిర్యాదు చేశారు.
Similar News
News March 12, 2026
పకడ్బందీగా టెన్త్ వార్షిక పరీక్షలు: HNK కలెక్టర్

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని HNK కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మాట్లాడుతూ..12079 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారని, ఇందుకు 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది నియమించారు.
News March 12, 2026
చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.
News March 12, 2026
The Hundred: పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనడంపై విమర్శలు!

ఇంగ్లండ్ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.


