News April 7, 2025

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Similar News

News April 15, 2025

ప్రతీ ఎమ్మెల్యే రూ.25వేలు ఇవ్వాలి: రేవంత్

image

TG: పార్టీ అభివృద్ధికి ప్రతీ ఎమ్మెల్యే జీతం నుండి రూ.25 వేలు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని నేతలకు స్పష్టం చేశారు. పదవుల విషయంలో అద్దంకి దయాకర్‌లాగా ఓపికతో ఉండాలని చెప్పారు. ఓపికతో ఉన్నాడు కాబట్టే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడని తెలిపారు.

News April 15, 2025

నేషనల్ హెరాల్డ్ కేసు: ఛార్జి‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతల పేర్లను పేర్కొంది. దీనిపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 25న వాదనలను విననుంది. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చింది.

News April 15, 2025

విశాఖలో TCSకు 21.16 ఎకరాలు కేటాయింపు

image

AP: విశాఖలో TCS(Tata Consultancy Services) సంస్థకు 21.16 ఎకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎకరం 0.99 పైసల చొప్పున భూమిని ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా TCS నుంచి రూ.1370కోట్ల పెట్టుబడులు, 12000 ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. TCSకు భూకేటాయింపు ద్వారా విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

error: Content is protected !!