News April 7, 2025
HYD: వర్సిటీల్లో ASST ప్రొఫెసర్‌ల ఖాళీలు ఇవే!

వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు TG ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా OUకు సంబంధించి 601 పోస్టులకు 131 మంది పనిచేస్తుండగా 470 ఖాళీలు ఉన్నాయి. JNTUH పరిధిలో 224 పోస్టుల్లో 86 మంది పనిచేస్తుండగా 138 ఖాళీలు ఉన్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 68 పోస్టులు మంజూరు కాగా 23 మంది పనిచేస్తుండగా 45 ఖాళీలు ఉన్నాయి. కొత్త రిక్రూట్‌మెంట్‌కు జీవో 21 జారీ చేసింది.
Similar News
News April 7, 2025
HYD: రేపు తెలంగాణ భవన్‌లో సమావేశం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ మహాసభ విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News April 7, 2025
HYD: ఈషాసింగ్‌ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.
News April 7, 2025
HYD: కంచ గచ్చిబౌలి విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, HCU విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.