News April 7, 2025

రాజమండ్రి: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

image

తూర్పు గోదావరి జిల్లాలోని సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 3, 2026

ధవళేశ్వరం: ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు.. గంజాయి నిందితుడికి జైలు

image

ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన గంజాయి నిందితుడు బహదూర్ రామ్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. ఇతనిపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్ చందానగర్‌లోనూ కేసులు ఉన్నాయని సీఐ టి.గణేశ్ శనివారం వెల్లడించారు. నిందితుడిలో మార్పు రాకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పీటీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 3, 2026

RJY: ‘గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి’

image

రంపచోడవరం జిల్లాకు గిరిజన వీరుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. తమ్మన్నదొర త్యాగాన్ని కేంద్రం గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గిరిజన యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

News January 3, 2026

గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం

image

కొవ్వూరు ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పట్టణ సీఐ పీ. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796622కు కాల్ చేయాలన్నారు.