News April 7, 2025
సంగారెడ్డి: యువతి అదృశ్యం.. కేసు నమోదు

యువతి అదృశ్యమైన ఘటన పుల్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపిన వివరాలు.. పుల్కల్ గ్రామానికి చెందిన ఓ యువతి (20) ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2025
ప్రభుత్వ వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు

TG ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేటులాంటి వైద్యం లభించిందని AP వ్యక్తి చేసిన <<16116590>>ట్వీట్‌పై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అన్న నానుడిని తిరగ రాశారు. తాము తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. ఇతర వైద్యులకు మీరు ఆదర్శంగా నిలిచారు. మీకు నా అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
News April 18, 2025
నంద్యాల మెడికల్ విద్యార్థిని కాపాడిన ట్రైనీ IPS

నంద్యాలకు చెందిన యువకుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది రామచంద్రాపురం మండల పరిధిలోని అడవిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించగా.. రామచంద్రాపురంలో ట్రైనింగ్ తీసుకుంటున్న IPS బొడ్డు హేమంత్ స్పందించారు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ట్రేస్ చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని కాపాడి కౌన్సెలిగ్ ఇచ్చారు.
News April 18, 2025
ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 15 మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ 100% పూర్తిచేయాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. ఇప్పటీవరకు 2027 మందికి ఇండ్లు మంజూరు కాగా, 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని, 114 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయన్నారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.