News April 7, 2025
ఖమ్మంలో ఏలూరు జిల్లా వాసి మృతి

ఖమ్మం పట్టణం నేతాజీనగర్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చింతలపూడికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా ఓ మహిళతో నేతాజీ నగర్‌లో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరిద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరగడంతో రవిప్రసాద్‌ను సదరు మహిళ గోడకు నెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 31, 2025
ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏయూ

రాష్ట్రవ్యాప్తంగా ఏపీసెట్ ప్రవేశ పరీక్ష మార్చి 28, 29వ తేదీల్లో జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రా యూనివర్శిటీ ఈరోజు విడుదల చేసింది. జనవరి 9వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఏపీసెట్ అర్హతను పరిగణనలోనికి తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం www.apset.net.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
News December 31, 2025
వరంగల్ క్రీడాకారుడిని ప్రశంసించిన మోదీ

వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన వరంగల్ క్రీడాకారుడు అర్జున్ ఎరిగైసిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దోహాలో జరిగిన ఈ పోటీల్లో అర్జున్ కనబరిచిన ప్రతిభ అద్భుతమని, ఆయన సాధించిన విజయాలు దేశంలోని యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
News December 31, 2025
EV సేల్స్‌లో టెస్లాను వెనక్కి నెట్టిన BYD

టెస్లాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యధిక EVలు విక్రయించిన కంపెనీగా చైనాకు చెందిన BYD నిలిచింది. 2025లో ఈ సంస్థ 21 లక్షల వాహనాలను విక్రయించింది. టెస్లా 17 లక్షల దగ్గరే ఆగిపోయింది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల విభాగంలో BYD దూసుకుపోతోంది. టెస్లా కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లకే పరిమితమైంది. అమెరికా, యూరప్ దేశాల్లో డిస్కౌంట్లు తగ్గడం కూడా టెస్లా అమ్మకాలపై దెబ్బకొట్టింది.


