News April 7, 2025
జగిత్యాల: ప్రారంభమైన 10వ తరగతి స్పాట్ వాల్యూషన్

జగిత్యాల పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో సోమవారం నుంచి పదవ తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు తెలుగు పేపర్ వాల్యూయేషన్ కోసం 70 మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ప్రతి రోజూ సబ్జెక్టుల వారిగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంది.
Similar News
News November 5, 2025
మణుగూరులో 144 సెక్షన్.. ఇతర ప్రాంతాల్లో నిరసనకు పిలుపు

మణుగూరులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఈనెల 7న తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని ఇతర నియోజకవర్గాల్లో చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పినపాక మినహా 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు. పినపాక నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు ఎక్కడి వారు అక్కడే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
News November 5, 2025
రంప: చెకుముకి జిల్లా పోటీలకు 42 మంది

అల్లూరి జిల్లాలో 14 ఉన్నత పాఠశాలల నుంచి 42మంది విద్యార్థులు చెకుముకి సైన్స్ పోటీలకు ఎంపికయ్యారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బొజ్జయ్య బుధవారం తెలిపారు. రంపచోడవరంలో విజేతలకు బుధవారం సర్టిఫికెట్స్ అందజేశారు. రంపచోడవరంలో ఈనెల 23న జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో వీరంతా పాల్గొంటారని వెల్లడించారు. ఈ పోటీలకు ఆదరణ పెరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు.
News November 5, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8:15 గంటలకు 1,18,501 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. ప్రాజెక్టు నుంచి 1,26,223 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 19.9 టీఎంసీలు, జలమట్టం 147.9 మీటర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.


