News April 7, 2025
మంచిర్యాల: యాక్సిడెంట్‌లో విద్యార్థి మృతి

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్‌కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News April 18, 2025
ఆ విషయం రాజ్ కసిరెడ్డినే అడగాలి: VSR

AP: మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ 3 గంటలపాటు విచారించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్‌కు సంబంధించి రెండు సమావేశాలు జరిగినట్లు నేను అధికారులకు చెప్పా. ఫస్ట్ మీటింగ్‌లో వాసుదేవరెడ్డి, మిథున్, సత్యప్రసాద్, కసిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News April 18, 2025
20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

ముందస్తు సమాచారం లేకుండా <<15595609>>400 మంది ట్రైనీలను తొలగించి<<>> విమర్శలపాలైన ఇన్ఫోసిన్ ఇప్పుడు యువతకు శుభవార్త చెప్పింది. FY2025-26లో 20K మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ వెల్లడించారు. జీతాల పెంపుపై మాట్లాడుతూ ‘కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి 10-12% పెంచాం. JANలోనే చాలామందికి శాలరీలు పెరిగాయి. మిగతా వారికి APR 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.
News April 18, 2025
అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యం: బాపట్ల ఎస్పీ

అక్రమ రవాణా, నేర నియంత్రణ లక్ష్యంగా గురువారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ప్రతి పీఎస్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలను ఎంచుకొని 3,799 వాహనాలను సిబ్బంది తనిఖీ చేశారని చెప్పారు. వీటిలో సరైన ధ్రువపత్రాలు లేని 136 అనుమానిత వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 268 వాహనాలకు చలానాలు విధించారన్నారు. అలాగే14 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.