News April 7, 2025
అయిజ: ‘అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దాం’

గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 12న జరిగే అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దామని అంబేడ్కరిస్ట్ వరదరాజు పేర్కొన్నారు. అయిజ మండలం కుట్కనూరు గ్రామంలో సోమవారం ఆలోచన పండుగ కరపత్రాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ వాదులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News January 8, 2026
Ashes: ఆసీస్ టార్గెట్ 160 రన్స్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ చివరి టెస్టులో ఆసీస్ విజయానికి 160 రన్స్ అవసరం. రెండో ఇన్నింగ్స్‌లో ENG 342 పరుగులకు ఆలౌట్ అయింది. బెథెల్(154) మినహా ఎవరూ రాణించలేదు. AUS బౌలర్లలో స్టార్క్, వెబ్‌స్టర్ చెరో 3, బోలాండ్ 2, నెసెర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ ఇవాళ చివరి రోజు కాగా మొత్తం 5 టెస్టుల సిరీస్‌లో AUS ఇప్పటికే మూడింట్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. ENG ఒక మ్యాచులో గెలిచింది.
News January 8, 2026
బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.
News January 8, 2026
కాకినాడ: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

తొండంగి మండలం వాకదారిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పలు ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏఎన్ఎం, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు MEO, DEO కార్యాలయాలను సంప్రదించలన్నారు.


