News March 26, 2024

వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి

image

పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వందశాతం అకౌంట్లో నగదు జమ చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో ఏనాడూ పంట నష్టపోయిన రైతులను BRS ఆదుకోలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో తాము రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.

Similar News

News March 7, 2026

MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

News March 7, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నకల్ స్టేజ్ వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో ఒకరు కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ రవి, మరొకరు కొత్తకోటకు చెందిన హమాలీ కూలీ నాగన్నగా గుర్తించారు. గాయాల పాలైన ఆర్టీసీ డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు.

News March 6, 2026

MBNR: ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

image

ప్రజా పాలని -ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహా పిలుపునిిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6 తారీకు నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.