News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్‌లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్‌లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
Similar News
News April 18, 2025
కాసేపట్లో మ్యాచ్.. స్టేడియం వద్ద వర్షం

క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా RCB-PBKS మ్యాచ్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం అక్కడ వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. వాన త్వరగా తగ్గి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షంతో ఇవాళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.
News April 18, 2025
కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడా?

SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ఎయిర్‌పోర్టులో భర్తతో కలిసి ఫొటో దిగిన ఆమె ‘గుడ్‌బై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కమిన్స్ మిగతా మ్యాచులు ఆడకుండా IPL మధ్యలోనే ఆసీస్ వెళ్లిపోతున్నాడా? అని SRH ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే అతడు భార్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్‌పోర్టు వెళ్లాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
News April 18, 2025
రేపు దేశవ్యాప్త నిరసనలకు VHP పిలుపు

హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.