News April 7, 2025
అల్లూరి: రెట్టింపైన మిరియాలు ధర

అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్న మిరియాల రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది కిలో రూ.350 పలుకగా నేడు రూ.600కి రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెదబయలు, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అధిక ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
News January 14, 2026
ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.
News January 14, 2026
మెట్రో మార్కు చిత్రకళ.. ‘పరిచయ్’ అదిరింది బాసూ!

మెట్రో రైలును పట్టాలెక్కించినట్టే చిత్రకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలంటున్నారు NVS రెడ్డి. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్, క్యాంప్ కళాభిమానులను ఫిదా చేస్తోంది. ఒకేచోట ప్రదర్శన, ప్రత్యక్ష చిత్రలేఖనం చూడటం అరుదైన అవకాశమని చెప్పుకొచ్చారు. జయవంత్ నాయుడు ఆధ్వర్యంలో 12 మంది దిగ్గజ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అద్భుతాలు ఇక్కడ కొలువుదీరాయి.


