News April 7, 2025

ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను అభినందించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మల్క కొమురయ్యను సోమవారం ఐటి పరిశ్రమ, వాణిజ్యం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అభినందించారు. కాగా, మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యలు పెద్దపల్లి జిల్లాకు చెందినవారు. వీరు పార్టీలు వేరైనప్పటికీ మంచి మిత్రులు కావడం కొసమెరుపు.

Similar News

News April 19, 2025

శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

image

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు

News April 19, 2025

అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

image

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్‌లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్‌లో చేసి చూపించారు. 

News April 19, 2025

కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

image

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.

error: Content is protected !!