News April 7, 2025
ఉత్తరాదికి నిధులు.. దక్షిణాదికి మోసం: కోదండరాం

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని MLC కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. HYDలో ఈ అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. పన్ను వసూళ్లలో మనమే ఎక్కువ చెల్లిస్తున్నామని వివరించారు. కానీ ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాదిని కేంద్రం మోసం చేస్తోందన్నారు.
Similar News
News April 19, 2025
శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు
News April 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 19, 2025
RCBకి ఆపద్బాంధవుడిలా టిమ్ డేవిడ్

IPL: టిమ్ డేవిడ్ RCBకి ఆపద్బాంధవుడిలా మారారు. ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ తానున్నానంటూ పరుగులు చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇవాళ PBKSపై RCB వికెట్లు టపటపా పడిపోయి 50 పరుగులైనా చేస్తుందా? అని అనుకున్న సమయంలో చక్కటి బ్యాటింగ్ చేసి ఆదుకున్నారు. కేవలం 26 బంతుల్లోనే 3సిక్సులు, 5ఫోర్లతో 50 బాదారు. చెన్నైపై(8బంతుల్లో 22), GTపై(18బంతుల్లో 32), DCపై(20 బంతుల్లో 37) రన్స్ చేశారు.