News April 7, 2025
మన్యంకొండలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..!

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. రాముడి కళ్యాణం అనంతరం ఈరోజు ఆనవాయితీ ప్రకారం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మంటపమైన లక్ష్మీ విలాసంలో శ్రీరాముడి పట్టాభిషేకానికి స్వామివారిని అలంకరించారు. శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకలతో మన్యంకొండ పులకించింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాములవారిని భక్తులు దర్శించుకున్నారు.
Similar News
News September 14, 2025
ములుగు జిల్లాలో 422మి.మీ భారీ వర్షపాతం నమోదు

ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 422మి.మీ వాన పడింది. సగటు వర్షపాతం 46.8మి.మీగా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వెంకటాపురంలో 130.2, వాజేడులో 43.6, మంగపేటలో 24.2, వెంకటాపూర్ లో 34.2, ములుగులో 17.2, గోవిందరావుపేటలో 23.6, తాడ్వాయిలో 23.6, ఏటూరునాగారంలో 61.6, కన్నాయి గూడెంలో 63.8మి. మీ వర్షం కురిసింది.
News September 14, 2025
VJA: నీటి పరీక్షల రిపోట్ల ఆలస్యంపై అనుమానాలు.?

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాప్తికి కారణాలపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. స్థానికంగా నిర్వహించిన కెమికల్ టెస్టుల్లో క్లోరిన్ శాతం సరిగ్గా ఉన్నా, మైక్రో బ్యాక్టీరియాలాజికల్ టెస్ట్ రిపోర్టులు నాలుగు రోజులుగా రాకపోవడం గమనార్హం. నీటి కాలుష్యం బయటపడితే ఉద్యోగాలు పోతాయనే భయంతో అధికారులు ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News September 14, 2025
HYD: డ్రగ్స్ పసిగట్టడంలో మన డాగ్ స్క్వాడ్ భేష్

డ్రగ్స్ పసిగట్టడంలో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డాగ్ స్క్వాడ్ మేటిగా నిలిచింది. రైల్వే ప్రొటెక్షన్ టీం డాగ్ కాంపిటీషన్ 2025లో నార్కోటిక్ ట్రేడ్ కేటగిరీలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్నట్లుగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం వెల్లడించింది. HYDకు వచ్చిన రైళ్లలో సేవలు అందిస్తున్నీ ఈ బృందం అద్భుతంగా తనిఖీలు చేసి, డ్రెస్‌ను పసిగట్టిందన్నారు.