News March 26, 2024

US బ్రిడ్జిని కూల్చిన ఓడలో అందరూ భారతీయులే

image

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఓడ ఢీకొన్న ఘటనలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. కాగా ఈ ఓడలోని సిబ్బంది అంతా భారతీయులేనని గుర్తించారు. మొత్తం 22 మంది ఉన్నట్లు యూఎస్ పోలీసులు నిర్ధారించారు. సింగపూర్ ఫ్లాగ్ ఉన్న ఆ నౌక బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా బ్రిడ్జి ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రదాడిగా సందేహం వ్యక్తం చేస్తోంది.

Similar News

News March 18, 2026

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు సబ్ డివిజన్ల పరిధిలో నేరాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 18, 2026

ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

image

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.