News April 7, 2025

ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

image

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 8, 2025

శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

image

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

News April 8, 2025

PDPL: కుమార్తె ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

image

అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి(D) జూలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సనత్‌కుమార్ వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అజ్గర్ పాషా(43) దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె స్థానిక యువకుడిని ఇటీవల ప్రేమవివాహం చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి గడ్డిమందు తాగి, సోమవారం మృతి చెందాడు.

error: Content is protected !!