News April 7, 2025
రోజా శ్రీవారి వారసురాలా..?: కిరణ్ రాయల్

టికెట్ల పేరుతో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి రోజా దోచుకున్నారని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. ‘వేంకటేశ్వర స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని రోజా అంటున్నారు. శ్రీవారు ఏమైనా రోజాకు ఫోన్ చేసి తనకు నిద్ర లేదని చెప్పారా? ఇది కదా ఓవర్ యాక్షన్ అంటే. ఆమె వేంకటేశ్వర స్వామి వారుసురాలా? లేదా అన్నమయ్య చెల్లా? దేవుడి పేరు చెప్పి దర్శన టికెట్లతో వ్యాపారం చేసింది’ అని ఆయన ఆరోపించారు.
Similar News
News September 17, 2025
పోడు భూములకు రుణాలివ్వండి: కామారెడ్డి కలెక్టర్

అర్హులైన రైతులకు, పోడు భూములకు పంట రుణాలు వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం ‘స్వచ్ఛత హీ సేవ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
News September 17, 2025
మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News September 17, 2025
12వేల మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు: కలెక్టర్

నల్లబర్లీ పొగాకు కొనుగోలులో అంతరాయం లేకుండా అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.