News April 7, 2025
ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!
News September 18, 2025
నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.
News September 18, 2025
నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.