News April 7, 2025

ఇకపై CSK మ్యాచ్‌లు కవర్ చేయం: అశ్విన్ YT ఛానల్

image

CSK ప్లేయర్ అశ్విన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఓ అనలిస్ట్ చెన్నై టీమ్ సెలక్షన్‌ను తప్పుబట్టారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానల్‌ ప్రకటన విడుదల చేసింది. ‘ఇకపై CSK మ్యాచ్‌లను కవర్ చేయం. ఛానల్‌లో గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలతో అశ్విన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని వివరణ ఇచ్చింది. అశ్విన్‌కు ఛానల్ ఉన్నట్లు తనకు తెలియదని ఇటీవల చెన్నై కోచ్ ఫ్లెమింగ్ అన్నారు.

Similar News

News April 8, 2025

భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. దేవుడికే తెలియాలి: థరూర్

image

భారత్‌పై US విధించిన ఆంక్షల పట్ల కాంగ్రెస్ MP శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్రం వెంటనే అమెరికాతో చర్చలు ప్రారంభించి ఈ సంక్షోభానికి తెరదించాలి. కొన్ని దేశాలు మాంద్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు. చర్చల తర్వాత భారత్‌కు సుంకాల నుంచి ఊరట లభిస్తుందేమో చూడాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

image

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

News April 8, 2025

‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

image

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్‌కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!