News April 7, 2025
లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
Similar News
News April 11, 2025
SKLM: అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతీరావు ఫూలే

అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసి, పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమంలో ఫూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారన్నారు. సంస్కరణోద్యమంగా పేరుగాంచి కుల మత వర్ణ విబేధాలకు స్వస్తి పలికారన్నారు.
News April 11, 2025
శ్రీకాకుళం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
శ్రీకాకుళం: ఈనెల 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలు వేట నిషేధం ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 61 రోజులు పాటు వేటనిషేధం సమయంలో యాంత్రిక బోట్లు గాని, మోటారు బోట్లతో వేటకు వెళ్లరాద్దన్నారు. ఈ 61రోజుల వ్యవధిలో చేపలతో పాటు, సముద్రపు జీవులు గుడ్లు, పిల్లలు ఉత్పత్తి చేసే సమయం అయినందున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.