News March 26, 2024

తాగునీటికి ఇబ్బంది లేదు: CS శాంతికుమారి

image

TG: రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో సమీక్షించిన ఆమె.. ‘3 ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత ఉంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం నిధులు విడుదల చేశాం. బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయ్యాయి. SRSP, ఎల్లంపల్లి, సాగర్‌లో నీటి నిల్వలున్నాయి. ఏప్రిల్ 2వ వారంలో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.

Similar News

News January 21, 2026

రేపు ఎంపీలతో జగన్ భేటీ

image

AP: వైసీపీ అధినేత జగన్ రేపు తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు జగన్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

News January 21, 2026

మేడారం.. నేడు ‘మండమెలిగే’ పండుగ

image

TG: మేడారం జాతరలో ‘మండమెలిగే’ ఘట్టం జరగనుంది. గ్రామంలోని సమ్మక్క ఆలయాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కడతారు. దీంతో ఇవాళ రాత్రి దర్శనాలు నిలిపివేశారు. పూర్వం అగ్ని ప్రమాదాలతో దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతరకు వారం ముందు కొత్త కొమ్మలతో శుద్ధి చేసి పునర్నిర్మించేవారు. దీంతో ‘మండమెలిగే’ అని పేరు వచ్చింది.

News January 21, 2026

భారత్ నుంచి వన్‌ప్లస్ ఔట్ అనే వార్తలపై క్లారిటీ

image

భారత్‌లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న వార్తలను మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ ఖండించింది. అవి ఫేక్ న్యూస్ అని, రూమర్లను నమ్మొద్దని చెప్పింది. ఇండియన్ మార్కెట్‌లో తమ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 2024లో సేల్స్‌ 20% పతనం, రిటైలర్ మార్జిన్స్ తగ్గుదల, లేఆఫ్స్ కారణంగా భారత్‌లో అన్ని రకాల సేవలను వన్‌ప్లస్ నిలిపివేయనుందనే రూమర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.