News April 7, 2025
ఎమ్మెల్యే గండ్రకు పంచాయతీ కార్యదర్శులు మెమొరాండం అందజేత

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కార్యదర్శులందరూ బదిలీలు నిలిపివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్చిన విధంగా కాకుండా నియోజకవర్గంలోని వేరే మండలాలకు బదిలీ చేయాల్సిందిగా అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అలాగే కార్యదర్శులు అందరూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేసేలా హామీ ఇచ్చారు.
Similar News
News April 8, 2025
మంగపేట: దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్

మంగపేట మండలం నరసింహసాగర్, మోట్లగూడెం, మల్లూరు గ్రామాల్లో ఉన్న కురిసిన భారీ వర్షాల కారణంగా 80% వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను మంగళవారం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, అధికారులు పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
News April 8, 2025
దాది రతన్ మృతి పట్ల సీఎం సంతాపం

బ్రహ్మకుమారీల దాది రతన్ మోహిని జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాది మోహిని గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని, దాది జీవితం ఆదర్శప్రాయమన్నారు. దాది మృతి రాష్ట్ర, దేశ, విశ్వ ఆధ్యాత్మికతకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.
News April 8, 2025
పీఎం మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భేటీ

పీఎం నరేంద్ర మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ ఢిల్లీలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. వీరితోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా క్రౌన్ ప్రిన్స్ ఇవాళ, రేపు భారత్‌లో పర్యటిస్తారు.