News April 7, 2025

KMR: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News April 8, 2025

భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. దేవుడికే తెలియాలి: థరూర్

image

భారత్‌పై US విధించిన ఆంక్షల పట్ల కాంగ్రెస్ MP శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్రం వెంటనే అమెరికాతో చర్చలు ప్రారంభించి ఈ సంక్షోభానికి తెరదించాలి. కొన్ని దేశాలు మాంద్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు. చర్చల తర్వాత భారత్‌కు సుంకాల నుంచి ఊరట లభిస్తుందేమో చూడాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

రబీ సీజన్‌ను పురస్కరించుకొని కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని తహాశీల్దార్లను ఆదేశించారు. ప్రతి కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేసే వరకు రెవెన్యూ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైఅధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

News April 8, 2025

జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

image

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్‌కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!