News April 7, 2025

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తాం: కర్నూలు ఎంపీ

image

కర్నూలును మెడికల్ హబ్‌గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.

Similar News

News January 30, 2026

9 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వండి: కలెక్టర్

image

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సులభంగా పంట రుణాలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కేడీసీసీ బ్యాంక్‌కు సంబంధించి జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా బృందాలకు 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందించాలన్నారు.

News January 30, 2026

కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

image

బస్సు ప్రయాణాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రద్దీని అదునుగా చూసుకుని దొంగలు ఆభరణాలు, బ్యాగులు అపహరిస్తున్నారని తెలిపారు. అపరిచితులను నమ్మవద్దని, తెలియని వారి నుంచి ఆహారం తీసుకోవద్దని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.