News April 7, 2025

నేను బతికున్నంతకాలం మీ ఉద్యోగాలు పోవు: మమతా బెనర్జీ

image

ఇతర రాష్ట్రాల పరీక్షల్లో, నీట్‌లో అవినీతి జరిగినప్పుడు ఆ నోటిఫికేషన్లను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. పరీక్షల్లో అవినీతి చేసిన వారి ఉద్యోగాలను తొలగించాలి తప్ప పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను బతికున్నంత కాలం అర్హులెవరూ ఉద్యోగాలు కోల్పోరని హామీ ఇచ్చారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.

Similar News

News April 8, 2025

జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

image

జైపూర్‌ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.

News April 8, 2025

పవన్ తనయుడి ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని స్కూలులో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడికి గాయాలైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన తన కుమారుడి వద్దకు బయల్దేరారు.

News April 8, 2025

ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.

error: Content is protected !!