News April 7, 2025
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి: MHBD కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ నమోదు వివరాలను ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News November 4, 2025
సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.
News November 4, 2025
MHBD: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 3 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ రాజు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం బతికి ఉన్న రాజును వైద్య సిబ్బంది మార్చురీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే రాజు మృతి చెందాడని ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 4, 2025
పెద్దపల్లి యార్డులో పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.6,844

పెద్దపల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి కొనుగోలు సజావుగా సాగింది. పత్తి క్వింటాలుకు కనిష్ట ధర రూ.5,701, గరిష్టం రూ.6,844, సగటు ధర రూ.6,621గా నమోదైంది. మొత్తం 477 మంది రైతులు 1,393.2 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. మార్కెట్ యార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం ప్రశాంతంగా సాగిందని వ్యవసాయ మార్కెట్ ఇంచార్జ్ మనోహర్ తెలిపారు.


