News April 7, 2025
కొందరు అధికారులే నిజమైన అంధులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

TG: దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధులను కోర్టు చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారులే నిజమైన అంధులని ఫైరయ్యారు. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ 2017లో పలువురు అంధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా వీరి సమస్యను త్వరగా పరిష్కరించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.
Similar News
News April 8, 2025
ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.
News April 8, 2025
మెగా DSC.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

AP: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. రాబోయే 4ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News April 8, 2025
KG రైస్కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.