News April 7, 2025
దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి

కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్ గౌడ్ (55) ఆదివారం రాత్రి దుబాయ్‌లోని తన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ ఐదేళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News November 20, 2025
బంజారాహిల్స్ రోడ్డు విస్తరణపై హైకోర్టు ఆదేశం

బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణకు జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. భూసేకరణ చట్టం నిబంధనలను పాటించకుండా జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ విక్రమ్ దేవ్‌తో సహా 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News November 20, 2025
ప్రకాశంలో ఆధార్ తిప్పలు.. కొలిక్కి వచ్చేనా?

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆధార్‌తో పడుతున్న అవస్థలు ఎక్కువేనట. జిల్లాలోని పాఠశాలల్లో 363236 మంది విద్యార్థులు ఉండగా, 302626 మందికి ఆధార్ ద్వారా అపార్ ID వచ్చిందని లెక్క. మిగిలిన 60610 మంది విద్యార్థుల వివరాలు నమోదు కావాల్సిఉంది. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కార్డులో తప్పుగా నమోదైన వివరాలను సవరించినా ఆ వివరాలే వస్తున్నాయని వాపోయారు. కాగా ఆధార్ సమస్యలపై కామెంట్ చేయండి.
News November 20, 2025
నేడు ఎర్రగుంట్ల RTPPకి అసెంబ్లీ కమిటీ.!

నేడు ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)ను రాష్ట్ర అసెంబ్లీ కమిటీ సభ్యులు సందర్శిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో 12 మంది కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లనున్నారు. RTPPలో విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, బొగ్గు కొరత తదితర అంశాలపై కమిటీ పరిశీలించనుంది. కాగా RTPP అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


