News April 7, 2025
HYD: ఈషాసింగ్‌ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్‌కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో ఇది దేశానికి మూడో పతకం.
Similar News
News April 8, 2025
HYD: ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు: కవిత

అనుముల ఇంటెలిజెన్స్ వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదన్నారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు.
News April 8, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 2.13 కోట్ల మంది ప్రయాణం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయంగా నిలిచి రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
News April 8, 2025
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.