News April 7, 2025

ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ విడాకులు?

image

ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సింగ్ ఐకాన్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. భర్త కరంగ్ ఓంఖోలర్(ఓంలర్)తో ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మరో బాక్సర్ భర్తతో ఆమె ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం ఆయన తన బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో కలసి దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ పుకార్లేనని కొందరు కొట్టిపడేస్తున్నారు.

Similar News

News April 10, 2025

ఈ నెల 17న ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కానున్నాయి. నిన్నటితో బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్షలు ముగిశాయి. తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, 17న రెండో సెషన్ రిజల్ట్స్ రానున్నాయి. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. మే 18న ఈ పరీక్ష జరగనుంది.

News April 10, 2025

జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా తెలివిగల వారని US<<16048311>> ప్రెసిడెంట్<<>> ట్రంప్ కొనియాడారు. తన దేశం అంటే ఆయనకు చాలా ఇష్టమని, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసని అన్నారు. త్వరలో జిన్‌పింగ్‌తో డీల్ కుదిరే అవకాశం ఉందని ఏ క్షణంలోనైనా ఆయన నుంచి ఫోన్ కాల్ రావచ్చన్నారు. చైనా-అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News April 10, 2025

RR జట్టుకు బిగ్ షాక్

image

GTతో మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న RR ఆటగాళ్లకు IPL యాజమాన్యం షాకిచ్చింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు కెప్టెన్ సంజూ శాంసన్‌కు రూ.24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా టీమ్‌లోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షల చొప్పున ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కట్టాలని ఆదేశించింది. ఇందులో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం వర్తిస్తుందని పేర్కొంది.

error: Content is protected !!