News April 7, 2025

రేపు రాప్తాడుకు మాజీ సీఎం జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

Similar News

News April 8, 2025

ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.

News April 8, 2025

మెగా DSC.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

image

AP: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. రాబోయే 4ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 8, 2025

KG రైస్‌కు రూ.43 ఖర్చు.. రూ.10కి అమ్ముకోవడం దారుణం: నాదెండ్ల

image

AP: సన్నబియ్యం విషయంలో తెలంగాణతో పోటీపడబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అందించేది నాణ్యమైన బియ్యమని అందుకుగాను KG రైస్‌కు రూ.43 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ మెుత్తంలో కేంద్రం 61, రాష్ట్రం 39శాతం భరిస్తోందని పేర్కొన్నారు. ఇంత ఖర్చుచేసి పేదలకు బియ్యం అందిస్తుంటే వాటిని రూ.10కి అమ్ముకోవడం దారుణమన్నారు. బియ్యం రీ సైక్లింగ్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

error: Content is protected !!