News April 7, 2025

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణమూర్తి

image

AP: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు చెడు చేసేలా ఉంది. దురుద్దేశంతోనే కేంద్రం పునర్విభజనకు పూనుకుంటోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News April 8, 2025

హరీశ్ శంకర్‌తో బాలకృష్ణ మూవీ?

image

నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్‌తోనూ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని సమాచారం. మరోవైపు హరీశ్ రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

News April 8, 2025

బాలీవుడ్ నటిపై వారెంట్ జారీ చేసిన కోర్టు

image

బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.

News April 8, 2025

ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: చైనా

image

మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.

error: Content is protected !!