News April 7, 2025

MI vs RCB: కోహ్లీకి ఆ వెలితి తీరేనా?

image

IPLలో భాగంగా మరికాసేపట్లో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ముంబైతో జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంతవరకూ ఎప్పుడూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోలేదు. దాదాపు 30-40 మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా అతడిని POTM వరించలేదు. 92*, 82*, 82* వంటి భారీ స్కోర్లు చేసిన మ్యాచుల్లోనూ ఆయనకు ఈ అవార్డు రాలేదు. ఈసారైనా ఆ వెలితి తీర్చుకోవాలని ఛేజ్‌మాస్టర్ భావిస్తున్నారు.

Similar News

News April 8, 2025

బాలీవుడ్ నటిపై వారెంట్ జారీ చేసిన కోర్టు

image

బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.

News April 8, 2025

ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: చైనా

image

మరో 50శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని చైనా తేల్చిచెప్పింది. ‘ఒత్తిడి పెట్టడమనేది మాతో మాట్లాడే విధానం కాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాం. సరైన పద్ధతిలో చర్చలు జరపాలి. మా హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్య నుంచైనా మమ్మల్ని మేం కాపాడుకుంటాం’ అని చైనా రాయబారి లియూ పెంగ్యూ స్పష్టం చేశారు.

News April 8, 2025

బాంబే హైకోర్టును ఆశ్రయించిన కమ్రా

image

తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘శివసేన శిండే వర్గం నాపై పెట్టిన కేసులన్నీ నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవే. స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. దయచేసి ఆ కేసుల్ని కొట్టేయండి’ అని అందులో కోరారు. కమ్రా పిటిషన్‌ను కోర్టు నేడు విచారించనుంది.

error: Content is protected !!