News April 7, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 అర్జీలు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
Similar News
News September 11, 2025
ప్రకాశం నూతన కలెక్టర్.. నేపథ్యం ఇదే!

ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2013 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అఫీసర్ గతంలో ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్టెప్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో, హౌసింగ్ కార్పొరేషన్ MD, కృష్ణా కలెక్టర్, విశాఖ గ్రేటర్ కమిషనర్‌గా వివిధ పదవులు నిర్వర్తించారు.
News September 11, 2025
ప్రకాశం కలెక్టర్ మీకోసంకు అధిక ప్రాధాన్యత!

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. 2024 జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఒక ఏడాది 3 నెలల పాలన సాగించారు. ఒంగోలు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో అర్జీదారులకు మాలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అర్జీదారులకు భోజన వసతి, ఫ్రీగా అర్జీల రాయింపు వంటి చర్యలు చేపట్టారు.
News September 11, 2025
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.