News March 26, 2024

వైసీపీలో చేరిన గంటా నరహరి

image

జనసేన నేత గంటా నరహరి వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన ఆయన ఈనెల 13న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నరహరితో చర్చించారు. ఇవాళ CM క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో YCP తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News January 13, 2026

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

News January 13, 2026

చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

image

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.

News January 13, 2026

చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.