News April 7, 2025
ఇంగ్లండ్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఈసీబీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా దేశం కోసం ఆడేందుకు బ్రూక్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఆయన ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
Similar News
News April 8, 2025
టారిఫ్‌లను ఆపే ఆలోచన లేదు: ట్రంప్

ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారన్న వదంతులు వచ్చాయి. వాటిని ట్రంప్ కొట్టిపారేశారు. ‘మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు. కానీ చర్చలకు రావాలనుకునే ఏ దేశంతోనైనా సరే మాట్లాడేందుకు మేం సుముఖంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని ఆయనతో భేటీ అయ్యారు. ఇటు భారత్ కూడా ఆ విషయంలో అమెరికాతో చర్చల్లో ఉంది.
News April 8, 2025
‘పరీక్షకు విద్యార్థుల ఆలస్యం’పై విచారణకు పవన్ ఆదేశం

AP: తన కాన్వాయ్ వల్ల విశాఖ పెందుర్తిలో విద్యార్థులు పరీక్షకు ఆలస్యమయ్యారన్న వార్తలపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఎంత సేపు నిలిపారో, విద్యార్థులు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎలా ఉందోనన్న విషయాలపై విచారణ చేయాలని వైజాగ్ పోలీసుల్ని ఆదేశించారు. కాగా.. పవన్ కాన్వాయ్ వెళ్లిన సమయంలోనూ ట్రాఫిక్‌ను ఎక్కడా ఆపలేదని వైజాగ్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
News April 8, 2025
నేడు గుజరాత్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఈరోజు గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ ప్రత్యేక సమావేశాలకు ఆయన హాజరవనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి నిన్నే అక్కడికి చేరుకోగా మంత్రులతో కలిసి సీఎం నేడు పయనమవుతారు. బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తీర్మానంపై సీఎం ప్రసంగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.