News April 7, 2025
పుండు మీద కారం.. గ్యాస్, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

గ్యాస్ సిలిండర్‌పై ₹50, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ₹2 పెంపుపై కాంగ్రెస్ ఫైరయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందంది. ‘ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది’ అని ట్వీట్ చేసింది.
Similar News
News April 11, 2025
డజను కోడిగుడ్లు రూ.536!

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News April 11, 2025
పోసానిపై అదనపు సెక్షన్లు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

AP: పోసాని కృష్ణమురళిపై కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని తాము ఆదేశించిన తర్వాత సెక్షన్ 111(వ్యవస్థీకృత నేరం) చేర్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సూళ్లూరుపేట CIకి నోటీసులిచ్చింది. కాగా TTD ఛైర్మన్‌ను దూషించారంటూ TV5 సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది.
News April 11, 2025
సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.