News April 7, 2025
చపాతీలు చేయలేదని చితకబాదిన టీచర్

చపాతీలు చేయనందుకు విద్యార్థినులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం టౌన్ రామవరం గిరిజన బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు 8వ తరగతి విద్యార్థినులను చపాతీలు చేసేందుకు ఓ టీచర్ నిద్రలేపింది. కొందరు లేచి చపాతీలు చేస్తుండగా, 21 మంది విద్యార్థినులు నిద్ర లేవలేదు. ఆ సాకుతో ఈ 21 మందిని గదిలో కర్రతో చితక బాదిందని పేరెంట్స్ ఆందోళన చేశారు.
Similar News
News January 16, 2026
వెండి ‘విశ్వరూపం’: 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగింది!

2026 ప్రారంభంలోనే వెండి ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో జనవరి 1న కేజీ వెండి రూ.2.56 లక్షలు ఉండగా కేవలం 16 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇవాళ రూ. 3.06 లక్షలకు చేరింది. పారిశ్రామికంగా పెరిగిన డిమాండ్, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా లోటు వల్ల వెండి ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్లకు వెండి భారీ లాభాలనిస్తోంది.
News January 16, 2026
‘కోస’ కోడికి భారీ డిమాండ్.. పందెంలో ఓడినా.. ధరలో మొనగాడే!

కోడిపందేల బరిలో చనిపోయిన కోడి(కోస)కు ప్రస్తుతం ఊహించని డిమాండ్ ఏర్పడింది. పందెం కోసం చికెన్, మటన్, డ్రై ఫ్రూట్స్‌తో రాజభోగం అనుభవించిన ఈ కోడి మాంసం రుచిగా ఉంటుందనే నమ్మకంతో జనం ఎగబడుతున్నారు. పందెంలో ఓడి ప్రాణాలు విడిచినప్పటికీ, ఒక్కో కోడి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. చనిపోయిన కోడికి ఈ స్థాయిలో రేటు ఉండటం చూసి సామాన్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
News January 16, 2026
KNR: ఎన్నికల నగారా.. టికెట్ వేటలో ఆశావహులు

మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్‌లో రాజకీయ సందడి మొదలైంది. కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో టికెట్ ఆశావహుల తాకిడి పెరిగింది. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తమ గళాన్ని వినిపిస్తూ, ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


