News April 7, 2025

జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

image

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్‌కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 12, 2025

మద్యం మత్తులో డ్రైవర్.. ఇటుకల లారీ పల్టీ

image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామశివారులో శనివారం లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వైపు ఇటుకల లోడ్‌తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో పెద్దకాపర్తి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ బోల్తా పడిన లారీ ముందు మద్యం మత్తులో నిద్రపోవడం గమనార్హం.

News April 12, 2025

రాజమండ్రి: చిన్నారికి ప్రముఖుల ప్రశంస

image

రాష్ట్రాలు వాటి రాజధానులు, 16 జాతీయ చిహ్నాలు, 7 ఖండాలు సునాయాసంగా చెప్పి అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్‌‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ అభినందించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మున్సిపల్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆ చిన్నారిని అభినందించారు.

News April 12, 2025

NZB: పోలీసుల అదుపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు

image

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. నరేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు 6వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి అర్సపల్లి బైపాస్ రోడ్డు వద్ద అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

error: Content is protected !!