News April 7, 2025
ప్రజావాణిలో 106 దరఖాస్తులు: కలెక్టర్ ప్రావీణ్య

వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 106 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 8, 2025
బాలీవుడ్ నటిపై వారెంట్ జారీ చేసిన కోర్టు

బాలీవుడ్ నటి మలైకా అరోరాపై ముంబైలోని ఓ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నటుడు సైఫ్ అలీఖాన్, మలైకా, కరీనా తదితర స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ మరో కస్టమర్‌తో గొడవ కాగా అతడిపై ఆయన దాడి చేశారు. అప్పటి నుంచీ ఆ కేసు విచారణలో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా కోర్టుకు రాకపోవడంతో ఇప్పటికే ఓసారి వారెంట్ జారీ చేసిన కోర్టు, తాజాగా మరోసారి వారెంట్ ఇష్యూ చేసింది.
News April 8, 2025
MNCL: పట్టభద్రుల గొంతుకగా నిలుస్తా: MLC అంజిరెడ్డి

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పట్టభద్రుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు.
News April 8, 2025
నాగర్ కర్నూల్ కలెక్టర్ కీలక సూచన

వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12గంటల నుంచి 3గంటల వరకు ప్రజలు ఎవరు బయట తిరగొద్దని కలెక్టర్ బధావత్ సంతోష్ సూచించారు. వైద్య ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.