News April 7, 2025
కుటుంబ సభ్యులపై నీచపు రాజకీయాలా?: తోపుదుర్తి

బంధువుల అమ్మాయితో తాను ఎయిర్‌పోర్టులో మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తూ టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రేపు జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా బంధువులు, కుటుంబసభ్యులను నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 8, 2025
చావును రాజకీయం చేయడానికే జగన్ పర్యటన: పరిటాల

ఒక చావును రాజకీయం చేయడానికే మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జగన్‌కు తెలియదని, ప్రకాశ్ రెడ్డి చెప్పిన మాటలు విని వస్తున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని హితవుపలికారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని, టీడీపీ నేతలు సంయమనం కోల్పోవద్దని సూచించారు.
News April 8, 2025
విడపనకల్: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విడపనకల్‌లో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 7, 2025
రామగిరి హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది తనిఖీలు

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.