News April 7, 2025
సిద్దిపేట: రాయితీని సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్

ఎల్ఆర్ఎస్ 25 శాతం రిబేట్ అవకాశం ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించినందున లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటిపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 8, 2025
హరీశ్ శంకర్‌తో బాలకృష్ణ మూవీ?

నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్‌తోనూ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని సమాచారం. మరోవైపు హరీశ్ రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
News April 8, 2025
NRPT: మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ స్థాపనకు దరఖాస్తులు ఆహ్వానం

రాజీవ్ యువ వికాస్ పథకం కింద మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కామన్ సర్వీ మేనేజర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 70% నుంచి 80% ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ISBలో డీటీపీ, కంప్యూటర్ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఎంచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఎంపీడీవో అధికారిని సంప్రదించాలన్నారు.
News April 8, 2025
నార్సింగి : భర్తతో గొడవ ఆత్మహత్య

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.