News April 7, 2025
సంక్షోభంలో ’ఆక్వా’.. నిద్రపోతున్న సర్కార్: జగన్

AP: రాష్ట్రంలో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోతే ప్రభుత్వం నిద్రపోతోందా అని మాజీ CM జగన్ ప్రశ్నించారు. టారిఫ్‌ల పేరు చెప్పి సర్కార్ మిన్నకుండిపోయిందని ఎక్స్‌లో విమర్శించారు. ‘100 కౌంట్ రొయ్యల ధర రూ.280 నుంచి రూ.200కు పడిపోయింది. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధరల పతనాన్ని అడ్డుకోవాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News April 8, 2025
ముంబైకి తి‘లక్’ కలిసిరావట్లే!

ముంబైకి ఛేజింగ్‌లో లక్ కలిసిరావట్లేదు. ఆ జట్టు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ ఫిఫ్టీ చేసిన ప్రతి మ్యాచులోనూ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఛేజింగ్‌లో ఏడు సార్లు అర్ధసెంచరీ చేయగా ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. వీటిలో రెండేసి మ్యాచులు ఆర్సీబీ, RRపైనే ఓడటం గమనార్హం. నిన్నటి మ్యాచులోనూ తిలక్ 56 రన్స్ చేసినా MIని గెలిపించలేకపోయారు. దీంతో 12 పరుగుల తేడాతో ఓడింది.
News April 8, 2025
GET READY.. ఇవాళ బిగ్ అప్డేట్స్

సినీ ప్రియులకు ఇవాళ బిగ్ అప్డేట్స్ రానున్నాయి. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ రానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఉ.11 గంటలకు ఈ ప్రకటన రానుంది. మరోవైపు ‘ఏజెంట్’ తర్వాత రెండేళ్లుగా సినిమా ప్రకటించని అక్కినేని అఖిల్ కొత్త సినిమా అప్డేట్ రానుంది. ఆయన బర్త్ డే నేపథ్యంలో ఇవాళ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
News April 8, 2025
దిగొచ్చిన ప్రభుత్వం.. ఆరోగ్య శ్రీ కొనసాగింపు

AP: ఆరోగ్య శ్రీ సేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిన్న నిలిపివేయడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. రూ.500 కోట్ల బకాయిలు తక్షణం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. అటు ఈ నెల 10 తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌తో నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.