News April 7, 2025
ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్‌ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.
Similar News
News April 8, 2025
పెరిగిన గ్యాస్ ధరలు

దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2KGల గృహ వినియోగ సిలిండర్‌పై ₹50 పెంచుతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించగా, ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలోని విజయవాడలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875 అయ్యింది. HYDలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.
News April 8, 2025
రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.
News April 8, 2025
తెలుగు రాష్ట్రాల్లో ‘అధిక బరువు’ సమస్య

ఏపీ, టీజీ రాష్ట్రాల్లో 82% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించి రిపోర్టును వెల్లడించింది. 81% మందిలో విటమిన్-D లోపం ఉందని, ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్-1 ఫ్యాట్ లివర్ సంకేతాలు ఉన్నాయని తెలిపింది. 77శాతం మహిళల్లో పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో 28% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొంది.