News April 7, 2025
కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.
Similar News
News April 8, 2025
రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.
News April 8, 2025
తెలుగు రాష్ట్రాల్లో ‘అధిక బరువు’ సమస్య

ఏపీ, టీజీ రాష్ట్రాల్లో 82% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించి రిపోర్టును వెల్లడించింది. 81% మందిలో విటమిన్-D లోపం ఉందని, ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్-1 ఫ్యాట్ లివర్ సంకేతాలు ఉన్నాయని తెలిపింది. 77శాతం మహిళల్లో పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో 28% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొంది.
News April 8, 2025
అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్

AP: గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా గంజాయి లేదా డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తు అధికారం ఈ పీఎస్ పరిధిలో ఉంటుందని అందులో పేర్కొంది. స్టేషన్ హెడ్‌గా డీఎస్పీ స్థాయి అధికారి ఉండనున్నారు.