News April 7, 2025
రాష్ట్రానికి రూ.34,600 కోట్ల మద్యం ఆదాయం

TG: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7% విక్రయాలు పెరిగినట్లు స్పష్టం చేసింది. పన్నుల రూపంలో రూ.7,000 కోట్లు, దరఖాస్తుల ద్వారా 264 కోట్లు వచ్చాయంది. బీర్ల కంపెనీలు 15 రోజులు సరఫరా నిలిపివేయడంతో వీటి అమ్మకాలు 3% తగ్గినట్లు పేర్కొంది.
Similar News
News April 13, 2025
ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నా: రాజమౌళి

జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.
News April 13, 2025
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ!

AP: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను చేనేతశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే ఐటీశాఖ సెక్రటరీ కె.భాస్కర్‌కు ఏపీహెచ్ఆర్‌డీఏ డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు, సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.
News April 13, 2025
రేపు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.