News April 7, 2025
RCBvsMI: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. బుమ్రా, రోహిత్(ఇంపాక్ట్ ప్లేయర్) జట్టులోకి వస్తున్నారని పాండ్య తెలిపారు.
MI: విల్ జాక్స్, రికెల్టన్, నమన్, సూర్య, తిలక్, హార్దిక్, సాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, విఘ్నేష్
RCB: సాల్ట్, కోహ్లీ, పడిక్కల్, పాటీదార్, లివింగ్‌స్టోన్, జితేష్, టిమ్ డేవిడ్, కృనాల్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
Similar News
News April 8, 2025
ఈ నెల 11న జాబ్ మేళా

TG: టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్‌లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. యువత భారీ ఎత్తున హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
News April 8, 2025
పెరిగిన గ్యాస్ ధరలు

దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2KGల గృహ వినియోగ సిలిండర్‌పై ₹50 పెంచుతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించగా, ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలోని విజయవాడలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875 అయ్యింది. HYDలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.
News April 8, 2025
రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

AP: రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.