News April 7, 2025

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 56 ఫిర్యాదులు

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. 56 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఫిర్యాదులని డీఆర్వో సంగీత స్వీకరించి తాగు చర్యల కోసం సంబంధించిన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ- 21, ఇతర శాఖలకు – 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు డీఆర్ఓ సంగీత సూచనలు ఇచ్చారు.

Similar News

News July 7, 2025

HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

image

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.

News July 7, 2025

HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

image

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.

News July 7, 2025

HYD: అన్ని రోడ్లు ఇలా చేస్తే ఎంత బాగుండో.!

image

HYD శివారు గౌలిదొడ్డి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా గుంతల మయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించారు. దీంతో HYD నగర వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఇలా చేస్తే ఎంత బాగుండోనని అంటూ X వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.